చంద్రబాబునాయుడు వ్యూహం ఫలిస్తున్నట్లే ఉంది చూస్తుంటే. ఎప్పుడైతే కేంద్రంలో రెండోసారి నరేంద్రమోడి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో వెంటనే చంద్రబాబు వ్యూహాలకు పదును పెట్టారు. దాని ఫలితమే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించటం. వాళ్ళ ఫిరాయింపుతో మారిన  కేంద్రప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలిసిపోతోంది.

 

విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో పిపిఏలను సమీక్షించాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం పదే పదే అభ్యంతరం చెబుతోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించిన బిజెపి నేతలు ఆ విషయాన్ని ఇపుడు ప్రస్తావించటమే లేదు. పైగా చంద్రబాబు హయాంలో సవరించిన రూ. 58 వేల కోట్ల పోలవరం అంచనాల్లో అవినీతి జరిగినట్లు తమకు సమాచారం లేదని కేంద్రమంత్రి చెప్పటమే ఇందుకు నిదర్శనం.

 

ఒకపుడు ఇదే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంగా ఉపయోగించుకున్నారని స్వయంగా నరేంద్రమోడినే ఎన్నికల సభలో ఆరోపించారు. కేంద్రం నుండి వచ్చిన నిధుల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు మోడి మండిపడ్డారు. ఏపికి వచ్చిన అనేకమంది కేంద్రమంత్రులు చంద్రబాబు అవినీతి గురించి పదే పదే ప్రస్తావించేవారు. అంతెందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంఎల్సీ సోము వీర్రాజు అండ్ కో ప్రతీరోజు చంద్రబాబు అవినీతిపై రెచ్చిపోయి మాట్లాడేవారు.

 

సీన్ కట్ చేస్తే ఎప్పుడైతే టిడిపి ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి చంద్రబాబు అవినీతిపై బిజెపి నుండి ఆరోపణలు ఆగిపోయాయి. అలాగే విద్యుత్ కొనుగోళ్ళపై జరిగిన పిపిఏలను సమీక్షిస్తానన్న జగన్ ను తప్పుపడుతోంది కేంద్రం. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని జగన్ ప్రయత్నిస్తుంటే దాన్ని బిజెపి కూడా అడ్డుకుంటున్నట్లే కనబడుతోంది చూస్తుంటే. మరి ఇందుకే కదా నలుగురు ఎంపిలను బిజెపిలోకి పంపింది చంద్రబాబు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: