ఏపీలోని ఆటో, క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లకు రూ.10వేలు ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పేర్ని నాని సమాధానం చెప్పారు. 

 

జగన్ పాదయాత్రలో ఆటో డ్రైవర్లు బండి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లతో ఇబ్బందులు పడుతూ  తమ సమస్యలు చెప్పుకున్నారని ఈమేరకు పాదయాత్ర సమయంలో 2018 మే1 న జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతిమాట జగన్ అమలు చేస్తారని, ప్రభుత్వం హామీలు నెరవేస్తుందని అన్నారు. ఈ అంశం మేనిఫెస్టోలో మాత్రమే కాకుండా బడ్జెట్ లో కూడా రూ.400 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. తమ వద్ద ఉన్న సమాచారం కంటే రాష్ట్రంలో ఎక్కువమంది డ్రైవర్లు ఉన్నా వారందరికీ పది వేలు ఇస్తామన్నారు.

 

 

నిజానికి మేనిఫెస్టోలో ఆటోలకు మాత్రమే హామీ ఇచ్చామని, ప్రభుత్వం ఏర్పడ్డాక కార్లు, టాక్సీలకు కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే వీరందరికీ పదివేలు చొప్పున అందిస్తామని మంత్రి పేర్ని అసెంబ్లీలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: