వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మొదటి నుండి అండగా ఉన్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా..! జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాల్లో ఆమె కూడా పాలుపంచుకున్నారు. ఎన్నో ఏళ్ల శ్రమ, పోరాటం తర్వాత వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టింది. జగన్ కు అత్యంత నమ్మకస్థురాలైన రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు.


అయితే అది జరగలేదు..! కొన్ని సమీకరణాల కారణంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అలిగారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆర్కే రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. 


బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ పక్షపాతి అనీ.. ఆ విషయం  బడ్జెట్‌ చూసినా.. నవరత్నాలు చూసినా.. ఆ విషయం అర్థమవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానున్నారు.


కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని.. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారని ఆమె చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: