2013లో జబర్దస్త్ షో ప్రారంభం అయినప్పటి నుండి జబర్దస్త్  షోకు రోజా గారు జడ్జ్ గా ఉన్నారు. జబర్దస్త్ షో అంత పెద్ద హిట్ కావటంలో రోజా గారి పాత్ర కూడా ఎంతో ఉంది. కానీ అతి త్వరలో రోజా గారు జబర్దస్త్ షోకు దూరం అవుతున్నారని సమాచారం లభిస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ షో నిర్వహకులు కొత్త జడ్జ్ ను వెతికే పనిలో పడ్డారట. రోజాను భర్తీ చేస్తే స్థాయి ఉన్న సీనియర్ హీరోయిన్ల కోసం వెతుకుతున్నారట. 
 
నిజానికి రోజాకు తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోకు దూరం కావటం ఇష్టం లేదు. 2014 ఎన్నికల తరువాత కేవలం ఎమ్మెల్యే భాద్యతలు మాత్రమే రోజాపై ఉండటంతో జబర్దస్త్ షోకు జడ్జ్ గా వ్యవహరించింది. కానీ రోజా ఇప్పుడు ఎమ్మెల్యే పదవితో పాటు ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా ఉన్నారు. అందువలన రోజా గారికి ఈ షోకు కాల్షీట్లు కేటాయించటం కష్టంగా మారింది. అందువలన రోజా ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. 
 
రోజా గారు ఇప్పటికే ఏపీఐఐసీ చైర్మన్గా భాద్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృధ్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రోజా గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల్లో75% ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి తమ వంతు సహాయ సహకారాలు ఉంతాయని చెప్పారు రోజాగారు. మరి రోజాను భర్తీ చేయబోయే సెలబ్రిటీ ఎవరో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూస్తే సరిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: