జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లను నియమిస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చారు, గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపికలు కూడా మొదలయ్యాయి. ఇక్కడే జగన్ కు తలనొప్పులు మొదలయ్యాయి.

 

జగన్ చెప్పిన ప్రకారం భర్తీ చేయాల్సిన గ్రామవాలంటీర్ల సంఖ్య 5 లక్షలు. అంటే ప్రతీ నియోజకవర్గానికి సుమారు 2857 పోస్టులు దక్కుతాయి. ఇప్పటికే సుమారుగా 9 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. వీటిలోనుండి అర్హులుగా ఎవరిని ఎంపిక చేసినా వైసిపికి సమస్యలు తలెత్తటం ఖాయం.

 

ఎంతమందిని ఎంపిక చేసినా వారి సంఖ్య 2857 కన్నా ఎక్కువుండేందుకు లేదు. కానీ పోస్టును ఆశిస్తున్న వారి సంఖ్య మాత్రం ప్రతీ నియోజకవర్గంలో వేలాదిగా ఉంటోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గంలోను వేలాది మంది కార్యకర్తలు ప్రాణాలకు తెగించి మరీ తెలుగుదేశంపార్టీ నేతలకు వ్యతిరేకంగా పని చేశారు.

 

అలాంటిది అటువంటి వారిలో కేవలం కొందరినే ఎంపిక చేస్తామంటే మిగిలిన వాళ్ళు ఒప్పకుంటారా ?  ఎంపికైన వారిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి ? పైగా నియోజకవర్గం నుండి కొందరినే ఎంపిక చేయబోతున్నారు కాబట్టి దరఖాస్తుదారులంతా మంత్రులు, ఎంఎల్ఏల సిఫారసుల కోసం క్యూ కడుతున్నారు. మొత్తానికి గ్రామవాలంటీర్ల ఎంపిక పెద్ద తలనొప్పి తెచ్చేట్లుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: