కియా కంపెనీ బాసు ,ఏపీ ముఖ్యమంత్రికి రాసిన లేఖ గత రెండు రోజులుగా ఆసెంబ్లీని కుదిపేస్తుంది....తాజాగా ఈ రోజు కూడా ఆ లేఖ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విన్నపంతో కియా మొదటి ప్లాంట్‌ను ఏపీలో పెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

ఈ మేరకు కియా మోటార్స్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసిందని ఆయన వెల్లడించారు.

' 2007లోనే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమను ఫ్యాక్టరీ పెట్టమని ఆహ్వానించారని ..' కియా కంపెనీ బాసు, ఎపీ ముఖ్యమంత్రి వైస్‌జగన్‌కి రాసిన లేఖను ఈ రోజు అసెంబ్లీలో మంత్రి రాజేంద్రనాధ్‌ చదివి వినిపించగానే, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు లేచి,

‘రాజేంద్రనాథ్‌రెడ్డి   గారూ.. మీరు చాలా తెలివైన వారు.. హ్యాట్సాఫ్.. ఎందుకంటే 2009లో రాజశేఖరెడ్డి గారు చనిపోయారు. ఆయన ఆత్మ కియా సీఈవో దగ్గరికి వెళ్లింది. 2016లో మీరు చంద్రబాబు దగ్గరకెళ్లండి. అనుమతిలన్నీ ఇస్తారు. కియా పెట్టండి అని వైఎస్ చెప్పారు. దీంతో ఆయనొచ్చి పెట్టారు. అదే కదా మీరు చెప్పే కథ. ఏం చెప్పాల రాజేంద్రరెడ్డి గారు.. మీరు ఎంత గొప్ప నాయకులంటే ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. దీనికి మిమ్మల్ని. మనస్ఫూర్తిగా మీకు కంగ్రాజ్యులేషన్స్...'' అని అన్నారు .
దీనికి సమాధానం గా  బుగ్గన..
'' చంద్రబాబు నన్ను తెలివైన వాడని అన్నారు. అందుకు ధన్యవాదాలు చెప్తున్నా. కానీ తెలివి ఉన్నా లేకున్నా నిజం నిజమే కదా . ఈ లేఖ జూన్ 13, 2019న రాశారు. ‘2007లో వైఎస్‌ను కలిశాను. కలిసినప్పుడు స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారు నన్ను ప్లాంట్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు’ అని లేఖలో కియా సీఈవో పేర్కొన్నారు. మీరు వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా దీవెన కిందే స్వీకరిస్తున్నాం.'' అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: