గిరిజన రైతులు సాగు చేసే అటవీ భూముల పట్టాలకు పునర్జీవం పొసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో యాజమాన్యంపై హక్కులను  అందించేలా చర్యలు తీసుకోనుంది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి  డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది . టీడీపీ హయాంలో ఈ అటవీ హక్కుల చట్టం పుర్తిగా నిర్వీర్యమైంది. పూర్తిస్థాయిలో గిరిజనులకు పట్టాలు లేవు. పట్టాలున్నా.. భూమి ఎక్కడ ఉందో తెలియలి పరిస్థితి. వీటన్నింటిని సర్వే చేసి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలని గతంలో గిరిజన సంఘాలు సైతం ఆంధోళన చేశాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అటవీ హక్కులకు ప్రాణం పొయనున్నారు. ఐటీడీఏ పరిధిలో 20 ట్రైబల్ షబ్  ప్లాన్ మండలాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 1250 గ్రామాలూ ఉన్నాయి. లక్ష 70 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 20 వేలకు పైగా గిరిజన కుటుంబాలు అటవీ భూముల్లో సాగు చేస్తూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారిలో ఇప్పటి వరకూ 18 వేల మంది గిరిజన రైతులకు సుమారు 38 వేల ఎకరాల వరకూ పట్టాలను ఇచ్చారు. మరో 2 వేల ఎకరాలకు పట్టాలు ఇవ్వవలసి ఉంది.

ఈ పట్టాలకు వెరిఫికేషన్ జరుగుతున్నట్టు సంబంధిత సిబ్బంది తెలియజేశారు. గతంలో పట్టాలున్నవారికీ ఎటువంటి లబ్ది చేకూరడం లేదని దీనికి కారణం గత ప్రభుత్వం హయాంలో రెవిన్యూ శాఖ వెబ్ ల్యాండ్ లో నమోదు చేయలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సందర్బంగా పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు భూములపై అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోనికి రాగానే అటవీ హక్కుల చట్టం అమలుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. రానున్న కాలంలో పంట రుణాలు అందించేందుకు కూడా ప్రణాళికలు తీసుంటామని తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: