వైసిపి ఎంఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసు పీకినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎంఎల్ఏలు మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటున్నారని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారట. సోమవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంఎల్ఏలతో జగన్ సమావేశం పెట్టారులేండి.  ఆ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తరపున ఎంఎల్ఏలందరూ ఎందుకు యాక్టివ్ గా ఉండటం లేదని నిలదీశారని పార్టీ వర్గాలు చెప్పాయి.

 

సభకు వచ్చే ముందు మంత్రులైనా, శాసనసభ్యులైనా సబ్జెక్టులపై బాగా ప్రిపేరై రావాలని స్పష్టం చేశారు. టిడిపి సభ్యులడిగే ప్రతి ప్రశ్నకు మంత్రులు ధీటైన సమాధానాలు చెప్పాల్సిందేనంటూ టార్గెట్ ఫిక్స్ చేశారట. ప్రతీ ఎంఎల్ఏ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సిందేనంటూ దిశా నిర్దేశం చేశారని వినికిడి.

 

తన పాలన ఎలా ఉండబోతోందో మొదట్లోనే తాను స్పష్టం చేసినా కొందరు ఎంఎల్ఏలపై ఆరోపణలు రావటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎల్ఏల వ్యవహార శైలిపై వచ్చే ఆరోపణలను తాను ఎట్టి పరిస్దితుల్లోను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారట. ప్రకాశం జిల్లాలో ఓ సర్కిల్ ఇన్సెపెక్టర్ బదిలీకి ఓ ఎంఎల్ఏల రూ 10 లక్షలు తీసుకున్నారన్న ప్రచారాన్ని బహుశా జగన్ పరోక్షంగా  గుర్తు చేసినట్లున్నారు.

 

పనితీరు సక్రమంగా లేని ఎంఎల్ఏలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని నిర్మొహమాటంగా చెప్పేశారట. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఎంఎల్ఏల పనితీరుపై నిఘావర్గాలు జగన్ కు రిపోర్టులు ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఎంఎల్ఏల పనితీరుపై జగన్ సివియర్ వార్నింగ్ ఇచ్చినట్లు అర్ధమైపోతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: