ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు పెంచారు.   గతంలో జరిగిన లోపాలన్నీ తన పాలనలో సరిదిద్దుతాని ఛాలెంజ్ చేశారు.  ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలు నెరవేర్చేందుకు సన్నద్దం అవుతున్నారు.  స్పందన కార్యక్రమం పెట్టి వచ్చిన ప్రతి అర్జీని ప్రభుత్వ అధికారులు విధిగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.  తన పాలనలో ఎక్కడైనా లంచాలు, అక్రమాలకు పాల్పపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ రోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.సభలో టీడీపీ బలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ... అధికారపక్షాన్ని వారు దీటుగానే ఎదుర్కొంటున్నారు.

టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో సభలో ఎక్కువ మంది వైసీపీ సభ్యులు ఉండటం లేదని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ప్రతి సభ్యుడు ఏ సమయానికి సభకు వస్తున్నారు, ఏ సమయానికి వెళ్లిపోతున్నారు అనే అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ విప్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు సభ్యుల హాజరుపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: