గంటా శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద ఎప్పుడు విమర్శలు చేస్తూ వార్తలో నిలుస్తూ ఉండేవాడు. అయితే కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం గంటా మౌనం వెనక 500 కోట్ల రూపాయల భూపందేరం దాగుంది. అవును.. గంటా తెరవెనకే ఉండిపోవడానికి ప్రధాన కారణం ఈ 500 కోట్ల భూపందేరమే అంటున్నారు విశ్లేషకులు. విశాఖలో భూముల ఆక్రమణలకు సంబంధించి గడిచిన ఐదేళ్లలో వచ్చిన కథనాలు అన్నీ ఇన్నీ కావు.


తెలుగుదేశం నేతలు విశాఖలో విచ్చలవిడిగా భూముల్ని ఆక్రమించుకున్నారు. ప్రైవేటు భూముల్ని కబ్జాలు చేయడంతో పాటు.. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. వీటిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేసింది. కానీ తన అధికార బలంతో టీడీపీ దాన్ని తొక్కిపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం వెనక గంటా ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారింది. టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన వెంటనే అవినీతిరహిత పాలన అందిస్తానని శపథం చేశారు జగన్. చెప్పినట్టుగానే ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అమరావతి భూములు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా ఎన్నో అంశాలపై సమగ్ర దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేశారు. అలా అవినీతిరహిత సమాజం దిశగా దూసుకుపోతున్న జగన్.. విశాఖ భూ ఆక్రమణలపై కూడా దృష్టిపెట్టారు. ఇదే గంటా భయానికి కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: