వైసిపి నాయకుడు పీవీపీ తాజా ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా ఆ పార్టీ తరఫున పోటీ పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా ఉన్న ఆయ‌న సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి కేశినేని నాని చేతిలో స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలోనే తనపై పోటీ చేసిన కేసినేని పివిపిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఈ క్రమంలోనే పివిపి నోటీసు ఇచ్చారు.


తాను రూల్స్ ప్ర‌కార‌మే నానికి నోటీసులు ఇచ్చాన‌ని చెపుతోన్న పీవీపీ కాస్త టైం గ్యాప్ ఇచ్చి ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు కూడా ఆయ‌న చెపుతున్నార‌ట‌. పీవీపీ వేసే ఈ దావా ఒక్క నాని మీదే కాకుండా ప్ర‌ముఖ మీడియా ఛానెల్స్ అయిన టీవీ 5, మ‌హాటీవీల మీద కూడా వేస్తున్నార‌ట‌. మొత్తం ఈ రెండు ఛానెల్స్‌, నాని మీద ఒక్కొక్క‌రి మీద రూ.100 కోట్ల చొప్పున మొత్తం రూ.300 కోట్ల అతి పెద్ద దావాకు పీవీపీ రెడీ అవుతున్నారు.


పీవీపీ వేసే ఈ దావాలో మ‌రో ట్వీస్ట్ ఏంటంటే ఇప్ప‌డి వ‌ర‌కు ఎవ్వ‌రూ వేయని విధంగా... మీడియా సంస్థ‌ల మీదే కాకుండా అవి ప్రసారం చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అందరి పైనా కూడా దావా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తాను వెనక్కు తగ్గేది లేదని, పివిపి చెబుతున్నట్లు బోగట్టా. ఇక ఇప్ప‌టికే పీవీపీ కేశినేని నానిని టార్గెట్‌గా చేసుకుని నిన్ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేసేది ఉందా... లేదా పార్ల‌మెంటులో సీట్లు అరిగేలా పిర్ర‌లు పెంచ‌డ‌మేనా ?  అని కూడా సోష‌ల్ మీడియాలో ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: