2019 అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు నుండే ఒక వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డిగారిపై ఎంతో అసత్య ప్రచారం చేసింది. ఆ మీడియాలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్నో లెక్కకు మించిన కథనాలు వచ్చేవి. ఆ కథనాల్లో నిజం లేదని తెలిసినా ఆ వర్గం మీడియా మాత్రం ఎన్నికల్లో ఒక పార్టీ గెలుపు కోసం ఎన్నో అసత్య కథనాల్ని చేసింది. పోలింగ్ జరిగే రోజుదాకా తన వైఖరి మార్చుకోలేదు ఆ మీడియా. 
 
కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఆ మీడియా మాటలు నమ్మలేదు. 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లు ఇచ్చి భారీ విజయాన్ని వైసీపీకి అందించారు. వై యస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించారు. ఆ మీడియా కథానాలు ప్రజలపై నామ మాత్రంగా కూడా ప్రభావితం చూపలేకపోయాయి.కానీ జగన్మోహన్ రెడ్డిగారు ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ఆ వర్గం మీడియాలో పెద్దగా మార్పులైతే రాలేదు. 
 
ఒక పత్రిక ఈ విషయంలో అప్పటికీ ఇప్పటికీ మారినా మరో పత్రిక మాత్రం ఇంతకు ముందులాగే చేస్తూ పోతుంది. ఆ పత్రిక ప్రభుత్వంలో జరుగుతున్న అభివృధ్ధి కంటే చిన్నపాటి విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంది. మరి ప్రజలు అంత స్పష్టమైన తీర్పునిచ్చినా ఆ పత్రిక మాత్రం ఇంకా ఎందుకు మారట్లేదో. 



మరింత సమాచారం తెలుసుకోండి: