నారా లోకేష్. ట్విట్టర్ పిట్ట. రాజకీయాన్ని వారసత్వంగా పొంది అదే తనకు జవసత్వమని భావించిన చిన్న బాబు. తండ్రి చంద్రబాబు సీఎం అయితే ఈయనగారు ఏకంగా అయిదు కీలకమైన శాఖలకు మంత్రిగారు. ఇక తండ్రి జాతీయ అధ్యక్షుడు అయితే ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి. కేవలం  బాబు గారి కొడుకు అన్న ఒకే ఒక్క అర్హతతో టీడీపీలో సెకండ్ పొజిషన్ కి చేరుకుని పార్టీ ఘోర  పరాజయానికి ప్రధమ కారకుడు అయ్యాడు.


ఇపుడు ఓడిపోయాక కూడా లోకేష్ తీరు మారలేదు. తామెందుకు ఓటమి పాలు అయ్యామన్న ఆలోచన అంతకంటే లేదు. తనకు ఉన్న విషయ పరిజ్ఞానంతో ట్విట్టర్లో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. జగన్ సర్కార్ ఏర్పడి  గట్టిగా రెండు నెలలు కూడా కాలేదన్న ఆలోచన మానేసి విమర్శలు సంధిస్తున్నారు.  అయిదేళ్ళ కాలానికి జనం ఓటేస్తే అన్ని హామీలూ ఇవాళే తీర్చాలని పట్టుపడుతున్నాడు. మరి ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగా కూడా  బాబు పాత హామీలు ఇంకా  ఎన్నో తీర్చని సంగతిని కొడుకు మరచిపోయారు.


అటువంటి చినబాబుని ఓ రేంజిలో ఆటాడుకున్నారు. వైసీపీ   తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిప్పులు చెరిగారు. ట్విట్టర్లో కామెంట్లు కాదు ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఎలాగూ గెలవలేకపోయావు కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీగా అయినా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకో అంటూ సవాల్ విసిరారు. 


పిచ్చుక గూళ్లు కడతామో, సౌకర్యంగా ఉండే ఇళ్లే కడతామో రాబోయే రోజుల్లో చూద్దువుగానీ అంటూ గృహనిర్మాణ పథకంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాజధానిలో దండుపాళ్యం దొంగల ముఠాల దోచుకున్న పచ్చనేతలని వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరూ ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హెచ్చరించారు. మొత్తానికి లోకేష్ కి సరైన షాక్ తగిలిందనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: