Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 5:37 pm IST

Menu &Sections

Search

బిల్డర్ నిర్లక్ష్యం..ఛిద్రమైన జీవితాలు!

బిల్డర్ నిర్లక్ష్యం..ఛిద్రమైన జీవితాలు!
బిల్డర్ నిర్లక్ష్యం..ఛిద్రమైన జీవితాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముంబాయిలో విషాదం చోటు చేసుకుంది.  ఒక బిల్డర్ తన స్వార్థానికి అమాయ ప్రాణాలు బలి తీసుకున్నాడు.  గత కొన్ని రోజులుగా ముంబాయిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.  ఈ వర్షాలకు రోడ్డు కొట్టుకు పోతున్నాయి..రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది..విద్యుతు వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఇదే సమయంలో కుండపోత వర్షాలతో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు.


ఈ నాలుగంతస్తుల భవనం శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకుపోయినట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం 11:40 గంటలకు ఈ భవనం కుప్పకూలినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.  ఈ భవనం ఏనభై ఏళ్ల క్రితం నిర్మించారు. ఇటీవల గత ఏడేళ్లుగా ఈ భవనం ఓ ప్రయివేటు బిల్డర్ చేతిలో ఉంది. డోంగ్రీ ప్రాంతంలోని తండేల్ వీధిలో ఉండే ఈ పురాతన భవంతిని స్థానికులు కేసరీభాయ్ బిల్డింగ్ గా పిలుస్తారు.


అయితే ఇది అప్పటి శిథిలావస్థకు చేరుకుందని..ఖచ్చితంగా కూల్చి వేసి కొత్త భవన నిర్మాణం చేయాల్సి ఉన్నా బిల్డర్ మాత్రం ఆ పనిచేయకుండా నిర్లక్ష్యంతో వదిలేశాడు. దాని పర్యవసానమే భారీ వర్షాలకు నానిపోయి కుప్పకూలిపోయింది. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సహాయచర్యల్లో ఐదుగురిని మాత్రమే రక్షించగలిగారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.  

ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.