వైసీపీ సర్కార్ ఏర్పడింది కొత్తగా. జగన్ కి సీఎం కుర్చీ ఎక్కడం కొత్త. ఇక మంత్రుల్లో అరడజన్ మంది తప్ప మిగిలిన వారంతా కొత్త పూజారులే. అదే ఇపుడు జగన్ కి శాపంగా మారుతోందా అన్న చర్చ సాగుతోంది. మంత్రుల్లో చాలా మందికి శాఖల మీద పట్టు లేదు. కొత్త కాబట్టి సర్దిచెప్పుకున్నా నేర్చుకుందామన్న ఆసక్తి ఎంతమందిలో ఉందో చూడాలి. 


ఇక సభలో గట్టిగా మాట్లాడే మంత్రులు కూడా  పెద్దగా లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎంతసేపూ సీనియర్ ఎమ్మెల్యలు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి  వంటి వారే సర్కార్ ని కాపాడుతున్నారు. అటువైపు చూస్తే టీడీపీలో మహానుభావులే ఉన్నారు. దేన్ని అయినా ట్విస్ట్ చేసే చాతుర్యం ఉన్న వారూ ఉన్నారు.


ఒక్క అచ్చెన్నాయుడు చాలు మొత్తం వైసీపీ 151 మందినీ గడగడలాడించేస్తున్నాడు. అసెంబ్లీలో అధికార పక్షం ఎపుడూ డిఫెన్స్ లో పడుతూనే ఉంది. అది బడ్జెట్ సమావేశాలో బాగా స్పష్టంగా కనిపిస్తోంది. హామీలన్నీ తీర్చారా అని అడిగితే మేం వచ్చి ఎన్నాళ్ళు అయింది బాబూ అంటూ గట్టిగా టీడీపీని నిలదీసే మంత్రి ఒక్కరు కూడా లేకపోవడం దారుణమే. ఒకరిద్దరు మంత్రులు నోరు చేసుకుంటున్నా భాష బాగుండకపోవడంతో అడ్డంగా దొరికేస్తున్నారు. మొత్తానికి సభా వ్యూహం ఇంకా వైసీపీకి అలవాటు కానట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: