తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలన్నది బీజేపీ ఆలోచన. అందుకోసం టార్గెట్ ఏపీ అంటూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎన్నికలు తాజాగా  జరిగాయి. కొత్త ప్రభుత్వం అధికారం పూర్తిగా అయిదేళ్ళు ఉంది. బీజేపీ ఏపీలో బలపడాలంటే ముందు ప్రతిపక్షం టీడీపీని ఎలిమినేట్ చేయాలి. అంతవరకూ కరెక్ట్ అనుకున్నా..


అసలు బీజేపీ చేస్తున్నదేంటి. పాత సరుకు కొంటాం అన్నట్లుగా టీడీపీలో ఉన్నపుడు తాము తిట్టిన వారినే చేర్చుకోవడమా. పోలవరం టెండర్లు ఓ మాజీ ఎంపీ గారికి చెందిన సంస్థకు ఇచ్చారని, అక్కడే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించి అదే పెద్ద మనిషిని కాషాయ కండువా కప్పి ఆహ్వానించడమా. అదే పనిగా ఇళ్ళ మీద ఐటీ, ఐడీ రైడ్స్ చేసి ఇపుడు ఆ ఎంపీలనే కలిపేసుకుని బలంగా ఉన్నామని చెప్పడమా. 


టీడీపీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఒక్క చంద్రబాబు వల్లనే టీడీపీ భ్రష్టుపట్టిపోలేదు. అందుకో ఉన్న నాయకుల వల్ల కూడా పార్టీ పూర్తిగా పతనం అయింది. ఇపుడు బాబుని వదిలేసి నాయకులను తీసుకుంటే బీజేపీకి ఏపీలో ఒరిగిందేముంది. అంతే కాదు, ఏపీలో మిగిలిన పార్టీల నుంచి ఫిరాయింపులు చేయిస్తే బీజేపీ నెగ్గేస్తుందా. అసలు కుదిరే వ్యవహారం కాదు. 


ఇక బీజేపీ ఏపీ వరకూ చూస్తే టీడీపీ 2 గా మారిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు మళ్ళీ బాబుకు బలాన్ని ఇస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో బీజేపీనే కాదు, కేంద్రంలో మోడీనీ కూడా బాబు బలంగా మారి ఇబ్బంది పెట్టడం ఖాయం 



మరింత సమాచారం తెలుసుకోండి: