అమరావతి అసెంబ్లీ లో కాపుల రిసర్వేషన్ పై కొనసాగుతున్న చర్చా. అధికార మరియ ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. కాపులను బీసీ లోకి చేరుస్తానని చేయకుండా మోసం చేశారు. కాబట్టి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారు.


5 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తానని చేయకుండా మోసం చేశారు. కాబట్టి ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని నిరాకరించారు అనడానికి ముఖ్య నిదర్శనం గోదావరి జిల్లాలలో వీళ్ళు సీట్లు కోల్పోవడమే అని జగన్ పేర్కొన్నారు. ఈ విషయం పై సమాధానాన్ని తెలియజేయలని జగన్ చంద్రబాబునాయుడిని  ప్రశ్నించారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, ఏపీలో కాపు సోదరులు.. వీరంతా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారని . సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధన మనందరికీ  తెలిసి కూడా గత టీడీపీ ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కల్పుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారని తెలిపారు.


మన పరిధిలో లేని వాటికి  చేస్తామని చెప్పగలం కాని రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే అది మభ్య పెట్టే చర్య అవుతుందన్నారు. గత  ప్రభుత్వం హయాంలో మంజునాథన్ కమిషన్ వేశారని, చైర్మన్ మంజునాథన్ సంతకం లేకుండా కమిషన్ అప్రూవల్ రిపోర్టు ఎక్కడైనా ఉంటుందా అని అన్నారు. చైర్మన్ సంతకం లేకుండానే మిగిలిన సభ్యులతో సంతకం చేయించి ఇదే కమిషన్ రిపోర్టు అని చెబితే దానికి విలువు ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ కమిషన్ ను ఎవరైనా పట్టించుకుంటారా అని అన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కమిషన్ వాలిడిటీ నిలబడే పరిస్థితి ఉంటుందా అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: