ముంబైలో నాలుగంతస్తుల భవనము కూలడం ఇప్పుడు దేశంలో ప్రకంనలు రేపుతోంది.  ముంబైలోని డోంగ్రీ నాలుగంత‌స్తుల భ‌వ‌నం మంగ‌ళ‌వారం కుప్ప కూలింది. భవన శిథిలాల కింద 40-50 మందికి పైగా చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ, రక్షర దళాలు సహాయ చర్యల్ని అందిస్తున్నాయి.


వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఘటనాస్థలానికి చేరుకొని… రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారిని బ‌ట‌య‌కు తీసిన పోలీసులు ఆసుప‌త్రికి త‌రలించారు. ఇంకా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ భవనం కుప్పకూలడం వెనుక సారైనా ఇంజినీరింగ్ ప్లానింగ్ , పరిమితులు లేకపోవటం కారణంగా చెబుతున్నారు. 


ఇప్పటికే ఈ విషయం మీద ముంబై అర్బన్ అథారిటీ ద్రుష్టి సారించింది. దీనికి గల కారణాలను లోతుగా విశ్లేస్తుంది. ఘటనకు కారణమైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారాలు చెప్పారు. కాగా ఇప్పటికే ముంబైలో ఇటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఈ బిల్డింగ్ ఒక ప్రైవేట్ ట్రస్ట్ కు సంభందించిందని మనకు ప్రాధమికంగా అందుతున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: