కేశినేని నాని ఇప్పుడు రూట్ మార్చారు.. ఈరోజు ఉదయం వరుకు తన పార్టీ నేతలను తానే విమర్శిస్తూ సమాధానం ఇచ్చిన నాని, ఇప్పుడు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కు ఒకే ఒక డైలాగ్ తో వారి విమర్శలకు సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేసుకున్నారు కేశినేని నాని, వరప్రసాద్. 


విజయవాడ ఎంపీ కేశినేని నానికి లీగల్ నోటీసులు పంపిన వరప్రసాద్.. ఆ నోటీసులను ఫోటోలు తీసి 'కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను'' అంటూ వాటిని ట్విట్ చేశారు పోట్లురి వరప్రసాద్. 


ఈ ట్విట్ కు స్పందించిన నాని వాటికీ స్పందిస్తూ 'ఇలాంటి ఉడత ఊపుళ్లు చిన్నప్పుడే చూశా' అంటూ ఒకే ఒక్క మాటతో ఘాటుగా స్పందించారు కేశినేని నాని. ఈ ట్విట్ కు కొందరు నెటిజన్లు స్పందిస్తూ 'మీ ఉడతా ట్విట్లు కూడా మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. మీ లాంటి రౌడీలకు మేము భయపడే వాళ్ళము కాదు' అంటూ ట్విట్ చేశారు. మరి కొందరు 'సూపర్ కౌంటర్' అంటూ ట్విట్ చేశారు. అయితే కేశినేని నాని చేసిన ఈ ట్విట్ కు పీవీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: