జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో ముఖ్యమైన పథకం అమ్మ ఒడి. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి వైసీపీ ప్రభుత్వం 15,000 రుపాయలు అమ్మఒడి పథకం ద్వారా ఇవ్వబోతుంది. 2020 సంవత్సరం జనవరి 26 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడి పథకం అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలల్లో , జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల తల్లికి ఈ డబ్బులు అందజేస్తారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 
 
కానీ రాష్ట్ర బడ్జెట్లో అమ్మ ఒడికి అవసరం ఉన్న నిధుల కంటే తక్కువగా నిధులు మంజూరు చేసారని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 82 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే కేవలం 43 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని, అమ్మఒడి పథకానికి అర్హుల్ని సగానికి తగ్గించటం ఏంటి అని వస్తున్న ప్రశ్నలకు మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు క్లారిటీ ఇచ్చారు. 
 
అమ్మఒడి పథకం పిల్లల్ని చదివిస్తున్న తల్లిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన పథకమని ఈ పథకంలో పిల్లల సంఖ్యకు ఎలాంటి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు. అమ్మఒడి పథకం అమలు చేస్తూ ఉండటంతో గతంలో కంటే పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. గ్రామ వలంటీర్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: