శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై వాడీవేడిగా చర్చ జరిగింది. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరేంటి అని చంద్రబాబు అడిగిన ప్రశ్నకు జగన్ ఆవేశంగా సమాధానం చెప్పారు. చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని అన్నీ తెలిసీ ప్రతి అడుగులోనూ మోసానికి పాల్పడ్డారన్నారు. కాపులను మోసం చేయడం వల్లే టీడీపీకు సీట్లు తగ్గాయనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ వ్యాఖ్యానించారు.


మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదన్నారు. తాను ఏదైనా చేయగలుగుతానని అనిపిస్తేనే చెబుతానని.. చేస్తానని చెప్పి మోసం చేయడం తన నైజం కాదన్నారు. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం ఇష్టం వచ్చినట్లు చేయడం కాదని జగన్ అన్నారు.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని.. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కాపులను మోసం చేశారన్నారు. నిజాయితీగా ఇంత సున్నితమైన అంశాన్ని చెయ్యలేను అని ఒప్పుకోవడం జగన్ కు మాత్రమే చెల్లింది. 


అందుకు ఆయనను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. మరోవైపు కాపుల సంక్షేమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయించింది. టీడీపీ హయాంలో కాపులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని.. ఖర్చు చేయకుండా వదిలేశారన్నారు. దస్త్రాల్లో ఉన్న లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయన్నారు. అయితే తాము కాపుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పారు. జగన్‌ ప్రసంగం అనంతరం అధికార, విపక్షాల ఆరోపణలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: