అంబటి రాంబాబు గత నాలుగు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ను టార్గెట్ చేస్తున్నారు.దీనికి కారణం వైసీపీ లో మొదటిసారి లేదా రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతి పక్ష నాయకుడి పై చేసిన కొన్ని వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా సంస్థలు మరియు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి పక్షాన్ని అవమానిస్తున్నారు మరియు అనాయ్యం చేస్తున్నారు అని ప్రజలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ముందే ఊహించిన వైసీపీ పెద్దలు ప్రజలలో విశ్వాసాన్ని నష్టపోకుండా ఉండడానికి సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు చేత మొదటి రోజు నుండి ప్రతిపక్ష నేతను టార్గెట్ ను చేయించారు.అంబటి రాంబాబు తనదైన శైలిలో కొత్తగా వచ్చిన జూనియర్ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తూనే ప్రతి విషయంలో చంద్రబాబు అండ్ కో పై సెటైర్లు వేస్తున్నారు.దానితో టీడీపీ అంబటి రాంబాబు సంధించే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తన మాటలలో తప్పులు దొర్లకపోవడంతో టార్గెట్ చేయలేక వేరే వాటి పై రాద్దాంతం చేస్తుంది.
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి సీనియర్ల ను ఎన్నికల ముందు మొదట పక్కన పెట్టాలని చూశారు.కాని ఆయన సన్నిహితులు  వల్ల  కొందరికైనా టికెట్ ఇచ్చారంట.ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో జగన్ కు సీనియర్ల వల్ల వచ్చే ఉపయోగం ఏంటో అర్థమైనట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: