రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ను కేంద్రప్రభుత్వం నియమించింది. హరిచందన్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిజెపి నేత. ఒడిస్సా రాజకీయాల్లో చాల సీనియర్ . ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. హరిచందన్ నియామకంతో  ఇప్పటి వరకూ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న ఇఎస్ఎల్ నరసింహన్ కు అనుబంధం తెగిపోతోంది.

 

దాదాపు నరసింహన్ పదేళ్ళుగా ఉమ్మడి ఏపి నుండి విభజిత తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గానే పనిచేశారు. యూపిఏ హయాంలో నియమితులైన నరసింహన్ ఎన్డీఏ-2 వరకూ గవర్నర్ గానే కొనసాగటం రికార్డనే చెప్పాలి. కాకపోతే రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లుగా వేర్వేరు నేతలను  నియమిస్తే ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, ఏ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడుంటంతో సమస్యల పరిష్కారం కష్టమనే చెప్పాలి.

 

మొత్తం మీద ఏపికి కొత్త గవర్నర్ అంటూ అనేకమంది పేర్లు చాలా కాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 1977 నుండి బిజెపిలోనే కొనసాగుతున్న బిస్వ భూషణ్ ను  మొత్తానికి ఏపికి గవర్నర్ గా నియమించటంలో విధేయతకే నరేంద్రమోడి పెద్ద పీట వేసినట్లు అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: