నాలుగు రోజుల నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం ఇస్తూ గత ప్రభుత్వం లాగా ప్రతిపక్ష నోరు నొక్కేయమని జగన్ ప్రభుత్వం మాటలను చేతలలో అమలు చేసి చూపిస్తుంది.ప్రస్తుతానికి ఇదొక్కటి ఒక తప్ప సభలో మరేదీ గొప్పగా చెప్పుకోవడానికి లేకుండా పోయింది.
అధికార పక్షం,ప్రతి పక్షం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో,ఎవరో అబద్ధం చెబుతున్నారో తెలియడానికి కొంత సమయం పడుతుంది.ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అన్నిటి పై కమిటీలను వేసింది. వాటి నివేదిక కోసం మరో మూడు నెలల పాటు వేచి చూడాలి.
కాని ఈలోపు మేము ఉత్తములం మమ్మల్ని కావాలనే ప్రజలలో తప్పుడు మనుషులుగా చేయాలి అనుకుంటున్నారని అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఆరోపిస్తున్నాయి.ఒకరి పై ఒకరు సభ మొదలైనప్పటి నుండి దుమ్ము ఏత్తి పోసుకుంటున్నరు.ఇది సరైన పద్ధతి కాదు.కనీసం ఇప్పటికైనా ఆ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షాలు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: