ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.  వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేయాలని సంకల్పించింది.  ఇందులో భాగంగా చకచకా పావులు కదుపుతున్న బీజేపీ, తాజగా అక్కడ పాలన  పెట్టింది.  ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది.  


ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఒక్కరే గవర్నర్ గా ఉన్నారు.  రెండు రాష్ట్రాల పాలన విషయంలో రెండు చోట్లకు తిరుగుతున్నారు.  కొన్ని రోజుల క్రితమే కొత్త గవర్నర్ ను నియమిస్తారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదు.  కాగా, ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.  


రాష్ట్రపతి భవన్ నుంచి ఈ వార్త అధికారికంగా వచ్చింది.  ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు అనసూయ ఊకేను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బిశ్వభూషణ్‌ జనసంఘ్‌, జనతా పార్టీలో పనిచేశారు.


ఏపీ కొత్త గవర్నర్ కు ఉండేందుకు రాజ్ భవన్ ను ఏపి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.  విజయవాడలో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన భవనంగా ఉపయోగించిన భవనాన్ని గవర్నర్ కోసం కేటాయించారని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: