హెరిటేజ్ ఫుడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. టిడిపి అధ్యక్షుడు, ఏపీ తాజా మాజీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన ఈ సంస్థ ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రివ్వుమంటూ ముందుకు దూసుకెళ్ళింది. ఎప్పుడైతే ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయిందో... తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందో  అప్ప‌టి నుంచే స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ షేర్ విలువ రోజురోజుకు పడిపోతుంది. 


రాజకీయాలకు... వ్యాపారాలకు లింక్ లేదని చాలామంది చెప్పినా హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో మాత్రం ఈ రెండింటికి మధ్య ఎంత బలమైన అనుబంధం ఉంటుందో మరోసారి స్పష్టమైంది. ఏడాది కాలంలో ఏకంగా హెరిటేజ్ షేర్ విలువ 223 రూపాయలకు పతనమైంది. ఈ షేరు విలువ అత్యధికంగా  2018 ఆగస్టు లో రూ.624 వరకు వెళ్లింది. తాజాగా ఈ షేరు ధర రూ.374కు కాస్త అటూ ఇటూగా ఊగిస‌లాడుతోంది. 


2014లో చంద్రబాబు నవ్యాంధ్ర సీఎం అయినప్పుడు 153 రూపాయలు ఉన్న హెరిటేజ్ ఫుడ్స్... 2016 సెప్టెంబర్ నాటికి రూ. 450 కి చేరుకుంది. 2017 డిసెంబర్ కు గరిష్టంగా 822 రూపాయల‌కు చేరుకుని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. 2014 త‌ర్వాత ఎంతో పిక్స్ వెళ్లిన హెరిటేజ్ షేర్ ఇప్పుడు తిరోగమన బాటలో వెళుతోంది. ఇందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పతనావస్థలో ఉండటమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఇక మే నెల‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక రూ.480 ఉన్న షేరు ధర జూన్ 14 2019 నాటికి రూ.412కు పడిపోగా.. నెల వ్యవధిలో మరింత కుంగిపోయి రూ.365కు తగ్గటం గమనార్హం. ఓవ‌రాల్‌గా ఒక్క యేడాదిలోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.225కు ప‌త‌న‌మైంది. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు జీవితంలో ఆయ‌న ఎలాంటి రాజ‌కీయ ఒడిదుడుకుల్లో ఉన్నారో ?  ఇప్పుడు హెరిటేజ్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: