ఇప్పుడు మానవాళి చూపులు చంద్రునిపై ఉన్నాయి.  ఒకప్పుడు చంద్రుడు అంటే దేవుడు.  ఆయనకు పూజలు చేసేవారు.  చంద్రగ్రహణం రోజున నిష్టగా ఉంటూ.. ఉంటారు.  దైవాన్ని కొలుస్తుంటారు.  గ్రహణం కాలంలో భోజనం చేయరు.  అలానే, చంద్రగ్రహణం తరువాత... స్నానం చేసి మిగతా పనులు కానిస్తారు.  


అయితే, యాభై సంవత్సరాల క్రితం అపోలో 11 లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపైకి వెళ్లారు.  చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు.  ఆ తరువాత అనేక దేశాలు చంద్రునిపైకి వెళ్లి వస్తున్నారు.  మనదేశం కూడా చంద్రునిపై అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నది.  


ఇందులో భాగంగా చంద్రయాన్ 2 ను ప్రయోగించబోతున్నది.  ఈ సందర్భంగా ఓ ప్రముఖ సంస్థ చంద్రునిమీద మీరు ఉంటె మొదట ఎవరికి మీరు ఫోన్ చేస్తారు అని అడిగితే.. దానికి చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా ఉన్నది.  


చాలా మంది తమ భాగస్వామికి మొదట ఫోన్ చేసి చెప్తామని అంటే.. కొందరు మాత్రం తన తల్లికి చెప్తామని, కొందరు స్నేహితులకు చెప్తామని చెప్పగా.. అతి కొద్దిమంది మాత్రమే తండ్రికి చెప్తామని సమాధానం ఇచ్చారు.  గతంలో ఇండియా చంద్రయాన్ 1 ను ప్రయోగించింది.  ఇది చంద్రునిపై నీరు ఉన్నట్టు కనుగొన్నది.  దీంతో ఆ నీటి జాడ గురించి అన్వేషణ చేసేందుకు ఇండియా చంద్రయాన్ 2 ను ప్రయోగిస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: