ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్  పరిధిలో ఎవరైనా నాటుసారా తరలించినా,తయారు చేసిన, అమ్మకాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలతో పాటు పిడి చట్టం ప్రయోగిస్తామని అలమూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. పట్టాభి చౌదరి హెచ్చరించారు . తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీపై వచ్చిన ఈయన  మంగళవారం స్థానిక ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇక నుండి నిరంతరం నాటుసారా విక్రయాలు ,తరలింపుపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని తరలించిన వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

 అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్కిల్ పరిధిలో గల బ్రాందీ షాపులు నిర్ణీత సమయాల్లోనే తెరిచేలా, ఎమ్మార్పీ రేట్లకే  మద్యం విక్రయించాలని గట్టి చర్యలు తీసుకోనునట్లు ఆయన తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ రాజేష్.చింతూరు నుండి బదిలీపై వచ్చిన ఆయన కూడా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
నాటుసారాపై ఉక్కుపాదం.

మరింత సమాచారం తెలుసుకోండి: