సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఒక్కొక్కరు వరుసగా పార్టీని వీడుతుండడంతో చంద్రబాబు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి పోయారు. ఈ తంతు ఇలా నడుస్తుండగానే విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన వార్‌ పార్టీ పరువును బజారుకీడ్చింది. చంద్రబాబుకు పార్టీ మీద పూర్తిగా అదుపు త‌ప్పంద‌ని ఫ్రూవ్ చేసేందుకు  ఈ సంఘ‌ట‌న పెద్ద నిదర్శనంగా నిలిచింది. చంద్రబాబు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానేయాల‌ని చెప్పినా కేశినేని నాని మాత్రం చంద్రబాబు మాట బేఖాతార్ చేస్తూ ఆయన్నే టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు.


చంద్రబాబు గారు మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోకపోతే తాను పార్టీ సభ్యత్వంతో పాటు... ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తామని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ రాజకీయాలతో చంద్రబాబుకు త‌ల‌బొప్పి క‌డుతుంటే ఇప్పుడు విశాఖ రాజ‌కీయాల‌తో మరో సరికొత్త తల నొప్పి ప్రారంభం అయింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు విశాఖ నగర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న వాసుపల్లి గణేష్‌కుమార్ తప్పించి.. వుడా మాజీ చైర్మన్ రెహ్మాన్ను ఆ పదవిలో నియమించారు. 


త‌న‌ను త‌ప్పించి త‌న‌కు ఇష్టంలేని రెహ్మ‌న్‌కు ఆ ప‌ద‌వి ఇవ్వ‌డం వాసుప‌ల్లికి ఇష్టంలేదు. పైగా ఎన్నిక‌ల్లో త‌న సిట్టింగ్ సీటును రెహ్మ‌న్ త‌న‌కు లేదా త‌న భార్య షిరీన్‌ రెహమాన్‌కైనా ఇవ్వాలని రెహమాన్‌ పట్టుబట్టారు. అయితే చంద్రబాబు వాసుపల్లికే రెండోసారి టికెట్‌ కేటాయించి.. పార్టీ అర్బన్‌ అధ్యక్ష పదవిని తొలగించి రెహమాన్‌కు కట్టబెట్టారు. దీంతో వాసుపల్లి, రెహమాన్‌ల మధ్య మొదటి నుంచీ ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. 


రెహ్మ‌న్‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చిన‌ప్పటి నుంచి వాసుప‌ల్లి గ‌ణేష్ అస‌లు పార్టీ గుమ్మం తొక్క‌డం లేద‌ట‌. పార్టీ నియ‌మావ‌ళి ప్ర‌కారం మూడు నెల‌ల పాటు స‌మావేశాల‌కు రానందున రెహ్మ‌న్ వాసుప‌ల్లికి షోకాజ్ నోటీసులు జారీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక రెహ్మ‌న్ ఐదారుసార్లు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం పెట్టినా వాసుప‌ల్లి రాలేదు. ఇక మంత్రి గంటా కూడా పార్టీ ఆఫీస్ గుమ్మం తొక్క‌డం లేదు. దీంతో ఈ వ్య‌వ‌హారాల‌న్నింటిని రెహ్మ‌న్ బాబు వ‌ద్ద పంచాయితీ పెట్టేందుకు రెడీ అవుతున్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: