దేశంలోని వివిధరాష్ట్రాల్లో విద్యుత్ యూనిట్ కొనుగోలు ఒప్పందాలు(పిపిఏ)ధర రు2.44 పైసలుండగా ఆంధ్రాలో మాత్రం రు.4.63పైసలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర వినియోగదారులను మోసం చేయడమేనని దీనివలన అదనపు భారం పెరిగిందని రు.2,500 కోట్లరూపాయల మేరకు ప్రజాధనం లూఠీ అవుతోం దని సామాజికవేత్త కాకినాడ వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు  సంఘం ప్రధాన కార్యదర్శి హేజీబు శ్రీనివాసరామక్రిష్ణ తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. ఈమేరకు వారు ప్రభుత్వానికి సంఘం ద్వారా విద్యుత్ విని యోగదారుల సబ్ కమిటీ తరపున వినతిపత్రాన్ని పంపారు.రాష్ట్రానికి నష్టం కలిగించే ఈ ఒప్పంద పిపిఏ తీరులను నిపుణులతో ఉన్నతస్థాయిదర్యాప్తు ద్వారా సమీక్షించి కొనుగోలురేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ ఒప్పందాలపై ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే రెండులేఖలు రాయడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమీక్షలు తగవని  ప్రయివేటు విద్యుత్ కంపెనీలకు కేంద్రం వత్తాసు పలకడం తగదన్నారు. ఈ ఒప్పందాల్లో ఆయాసంస్థలు పరిమితిదాటి బ్యాంకులనుంచి రుణాలు తీసుకోవడంవలన వాటిని సకాలంలో చెల్లించకపోతే రు.450 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర వినియోగదారులు మాత్రమే మోయాల్సివుంటుందని పేర్కొన్నారు.

 తప్పు ఎవరు చేసినా అందుకు శిక్షార్హులేనని దీనికి కుంటిసాకులు చెబుతూ పెట్టుబడుదారులు మృగ్యమవుతారన్న బూచిని ప్రదర్శిస్తూ విద్యుత్ కోనుగోళ్ళ ఒప్పందాల అవక తవకలు వెలుగుచూడకుండా విద్యుత్ వినియోగదారులను బలిపశువులుగా ఏమార్చాలని చూసే ప్రయత్నం అప్రజాస్వా మికమన్నారు. ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విద్యుత్ ఒప్పంద (పిపిఏ)సమీక్ష లకు ప్రజలమద్దతు వుందని అలా నిర్వహించకుంటే నూతన రాష్ట్రప్రభుత్వ తీరుని కూడా అనుమానించాల్సి వుంటుందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: