మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పటిలాగానే సాగుతుంది. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఇకనుంచీ ప్రజల్లోనే మేము ఉంటాం అని ఎప్పటిలాగే రొటీన్ డైలాగ్ చెప్పి.. మళ్ళీ ప్రజల వైపు కన్నెత్తి కాదు కదా.. కనీసం కనుఱెప్ప కూడా కదల్చి  చూడలేదు.  'జ‌న‌సేన పార్టీ ఓట్ల కంటే ఎక్కువ‌గా  ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకుంద‌ని' పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతుంటాడు. బహుశా  ఇదేనేమో పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే.  రీల్ లైఫ్ లో  హీరోగా చేసిన పవన్.. రియల్ లైఫ్ లో రోజులు గడిచే కొద్దీ  నిజమైన హీరో అనిపించుకోలేకపోతున్నాడు.  ప్రచారంలో 'ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయ‌లేమో చూస్తా' అని పలికిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అసలు ఏమి చేస్తున్నాడు. ఏపీకి కాబోయే సీఎం నేనే అని ఎన్నికలకు ముందు చెప్పిన మన పవర్ స్టార్ చివరికీ పార్ట్ టైం పొలిటీషియన్ గానే మిగిలిపోతాడా..?  


నిజానికి పవన్ కి అయితే.. రాజకీయాల్లో చాలానే చేయాలనీ ఉంది.. ఎంతోమందికి మేలు చేయాలని ఉంది.  కానీ ఎందుకో పవన్ విజన్ కి తగట్లు పరిస్థితులు  సెట్ కావట్లేదు.  జగన్ లాగా పాదయాత్ర చేస్తే.. తనని చూడటానికి జనం ఎగబడతారు.. అప్పుడు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది ఇలాంటి భ్రమల్లో  ఉంటాడు మన పవర్ స్టార్.  ఇది కొంతవరకు  నిజమే కావొచ్చు.  కానీ ఇలాంటి ఊహలే మన పవర్ స్టార్ పరువుని తీసేస్తున్నాయి.  రెండు చోట్ల పోటీ చేసినా.. పవన్ గెలుపు రుచి చూడలేకపోయాయి. పవన్ ను చూసి జాలిపడాల్సి వస్తోనందుకు  జనసేకలకు కూడా  బాధ పడుతున్నారు.  ఒక పక్క  అధికారం లేనప్పుడే జనబలాన్ని పోగేసుకున్న జగన్..  అధికారం ఉన్నప్పుడు  ఏ స్థాయిలో  తన బలాన్ని బలగాన్ని పెంచుకుంటాడో వేరే చెప్పాలా..?   మరి 'జగన్' ప్రభంజనంలో  'పవన్' రాజకీయం నిలబడుతుందా..  పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా  రాజకీయాలు చేసినా చెయ్యకపోయినా.. సినిమాలు చేస్తే.. అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: