జీవనోపాధి మెరుగుకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని డా.బీఆర్ అంబేత్కర్ విశ్వవిద్యాలయ  మాజీ వీసీ ప్రొఫేసర్ లజపతిరాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడుతుందన్నారు. పర్యాటక రంగం స్వయం ఉపాధికి వనరు అని వివరించారు. పెట్రోల్ రంగం తర్వాత టూరిజంలోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువని అన్నారు. టూరిజం ఓ ఇండస్ట్రీ అని అభిప్రాయపడ్డారు. చిన్న దేశాలు ప్రకృతి సంపదను అభివృద్ధి పరుచుకుని రూ. కోట్లు గడిస్తున్నాయని వెల్లడించారు.

2017-18 లో భారత్ నో 10.1 మిలియన్ విదేశీయులు పర్యటించారని.. వారినుంచి దేశానికి రూ.17.783  కోట్ల విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు 1232 మంది విదేశీయులు పర్యటించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా టూరిజం అభివృద్ధిలో ప్రధానస్థానంలో ఉందన్నారు.

శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయడానికి ఎన్నో అవాకాశాలు ఉన్నాయని , పురాతన ఆలయాలు, కట్టడాలు, పొందూరు ఖాదీ, బుడితి కంచు వస్తువులు తయారీ, తేలినీలాపురం వంటి సందర్శక స్థలాలు ఉన్నాయని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాలో టూరిజం ప్యాకేజిని ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: