గడువు పూర్తయినా ఉద్యోగుల  బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 10 తో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముగిసింది. కానీ ఇప్పటికీ ఈ వ్యవహారం కొనసాగుతూనే  ఉంది.రాజకీయ నాయకులు సిఫార్సులు, అధికారుల అండతో కొందరు ఉద్యోగులు నచ్చిన చోటుకు అక్రమాలకు తెరతీస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖల్లో అధికారులు పాత తేదీలతోనే బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నెల పదో తేదీతో బదిలీలు ప్రక్రియ ముగించవలసివున్నా..  పలు శాఖల్లో ఇంకా బదిలీలు కొనసాగడం చర్చినీయాంశంగా మారింది. బదిలీల వ్యవహారం ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్  విధానంలో జరుగుతున్నందున అధికారులు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా జరుగుతున్న ఉద్యోగుల బదిలీలలో రాజకీయ నాయకుల సిఫార్సులు ఉంటేనే బదిలీలు జరుగుతున్నాయని కొందరు వాపోతున్నారు.

 అధికారుల సైతం తమకున్న అధికారాలను వినియోగించుకొని బదిలీల్లో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక వైపు అవినీతిరహిత పాలన అందించాలంటూ పదేపదే చెబుతున్నా.. మరోవైపు పరిస్థితుల్లో ఎక్కడా చిన్న మార్పు కూడా కనిపించపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: