తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే ఆ పార్టీ నాయకత్వం ఇబ్బంది పెట్టాలన్నది విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యూహమా? అంటే  అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే.  ఒకవైపు పార్టీ ఓటమి,  మరొకవైపు తమ్ముళ్ల   మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ చూసి  ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది .


 విజయవాడ ఎంపీ కేశినేని నాని,  ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మధ్య  గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియా వేదికగా  జరుగుతున్న తిట్ల యుద్ధం,  పార్టీ క్రమశిక్షణా రాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .  అయినా అధినేత చంద్రబాబు ఎవ్వరిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు .  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దేవినేని ఉమా కు ఇస్తున్న ప్రాధాన్యత తనకు  ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో ఉన్న కేశినేని నాని,  గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండడం ఆ  పార్టీ నాయకత్వం వేచి చూసే ధోరణిని అవలంభిస్తుంది . గత కొన్ని రోజులుగా దేవినేని ఉమా , బుద్ధా వెంకన్నలపై విమర్శలు సంధించిన కేశినేని నాని ,  తాజాగా నేరుగా పార్టీ అధినేత ఆయన టార్గెట్ చేయడం చూస్తుంటే అసలు  అయన  పార్టీలో ఉంటారా? బయటకు వెళ్తారా ??  అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి .


 ఒకవేళ కేశినేని తో టిడిపిని వీడితే వైకాపాలో  చేరే పరిస్థితి లేకపోవడంతో  కమలం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి బిజెపి లో చేరాలంటే పార్టీ పిరాయింపుల చట్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బంది పెట్టే విధానం విధంగా వ్యవహరించి ఆ పార్టీ నుంచి సస్పెండ్ గురయ్యే విధంగా వ్యవహరించాలన్నది  కేశినేని నాని వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: