రాజకీయాల్లో స్పీడ్ గా నిర్ణయాలు తీసుకోవడం.. పైగా అందులో సంచలనాత్మక నిర్ణయాలను అవలీలగా ప్రకటించేయడం అంటే.. ఈ తరంలో  అది ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవాలి. ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండీ.. జగన్ తన నిర్ణయాలతో  ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు. అమ్మబడి లాంటి నిర్ణయాల పై విమర్శలు వచ్చినా.. జగన్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు.  జగన్ మావోయిస్టుల విషయంలో కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నాడు. నిజానికి  ఏపీలో ఇపుడు మరో కీలకమైన సమస్య మావోయిస్టులు.  మావోయిస్టుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం  కొన్ని రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో  సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 


అయితే మొన్న జరిగిన సమావేశంలో పలు అంశాల పై చర్చలు జరిపి  ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారట జగన్. ముఖ్యంగా  లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతో పాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులను పునర్మిర్మించడం తదితర విషయాల పై  జగన్ పాజిటివ్ రియాక్ట్ అయ్యారట. మావోల విషయంలో ఆ విధంగానే ముందుకు పోవాలని  జగన్  ఆ కమిటీకి కూడా  సూచించాడట.  ఈ కమిటీకి ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. 

 

కాగా  మావోయిస్టులు పెట్టిన డిమాండుల పై కూడా  జగన్ ప్రభుత్వం  త్వరలో చర్చలు జరిపి.. వారికీ అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  మొత్తానికి జగన్,  మావోస్టుల మేలు కోసం మరో  సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటే  చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: