రాజకీయాల్లో ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేం. దాని పట్టుకుని రచ్చ చేయడానికి మరో పక్షం సిధ్ధంగా ఉంటుంది. ఇక అదే అలవికాని చోట అధికంగా వ్యవహరించినా కూడా అది చివరికి చేటు తెస్తుంది. ఇపుడు అదే పరిస్థితి నాయుడు గారికి ఎదురైంది.


అసెంబ్లీలో ఒక వివాదంలో స్పీకర్ ను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మీరు రాసిస్తే చదువుతా అని వ్యాఖ్యానించారు.దీనిపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు చంద్రబాబును ఉద్దేవించి తమ్మినేని ప్రశ్నిస్తూ,మీరు రాసిస్తే నేను చదువుతా అని అచ్చెన్నాయుడు అనడాన్ని సమర్దిస్తారా అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడి మాటలను సమర్థించడం లేదని చెప్పక తప్పలేదు.


ఇక అంతకు కొన్ని రోజుల ఇదే సభలో  ముందు మరో నాయుడు గారు అదే నిమ్మల రామానాయుడు రుణ మాఫీ గురించి మాట్లాడుతూ టీడీపీ కూడా అమలు చేసిందని చెబుతూ చంద్రబాబుని ఇరకాటంలో పడేశారు. అపుడు కూడా చంద్రబాబుకు అధికార పక్షం వైసీపీ చేతిలో అవమానం తప్పలేదు. ఏకంగా సీఎం జగన్ చేత రాజీనామ చేయ్ అనిపించేసుకున్నారు. ఏంటో చంద్రబాబుకు కుడి ఎడమల్లా ఉన్న ఇద్దరు నాయుళ్ళు కొంప ముంచేలా ఉన్నారని తమ్ముళ్ళు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: