ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రం నియమించినా బిశ్వభూషణ్ హరిచందన్‌‌ గారికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేధికగా ఘన స్వాగతం పలికారు. బిశ్వభూషణ్ హరిచందన్‌‌ ను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తున్నట్టు కేంద్రం రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. 


ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ 'శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌‌ గారు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైనందుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. రాష్ట్రా అభివృద్ధి కోసం మీతో కలిసి పని చెయ్యడానికి ఎదురు చూస్తున్నాను' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విట్ చేశారు. 


కాగా బిశ్వభూషణ్ హరిచందన్‌‌ ఒడిశాకు చెందిన సీనియర్ బీజేపీ నేత. 1971లో భారతీయ జన సంఘ్ లో చేరిన బిశ్వభూషణ్ హరిచందన్‌‌ కొంత కాలం తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. బిశ్వభూషణ్ హరిచందన్‌‌ రచయితగా కూడా ఎన్నో పుస్తకాలు రచించారు. సిలికా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిశ్వభూషణ్ హరిచందన్‌‌ న్యాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: