వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విదేశీ పర్యటనపై ప్రశ్నించారు. ఆంధ్రకు ఆ దేశం నుంచి పెట్టుబడి తెస్తా, ఈ దేశం నుంచి తెస్తా అని వెళ్లిన మీరు ఆంధ్రప్రదేశ్ కు ఏమి తీసుకొచ్చి పెట్టారంటూ చంద్రబాబుని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. 
గత 5 ఏళ్ళల్లో చంద్రబాబు నాయుడు 38 దేశాలు తిరిగొచ్చారాని, 39 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని వైసీపీ విజయసాయి రెడ్డి ట్విట్ చేసారు. విజయ్ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'పెట్టుబడులు తెస్తానని చంద్రబాబు 38 దేశాలు తిరిగొచ్చారు. 39 కోట్ల ప్రజాధనం ఖర్చయింది. ఇంతకూ ఏం తెచ్చారని అడిగితే 16 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకొని వచ్చారట. వాస్తవానికి వంద కోట్లు కూడా రాలేదు. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఇంకా అవే అబద్ధాలు వల్లిస్తున్నారు'.అంటూ ట్విట్ చేశారు. 
ఈ ట్విట్ కు నెటిజన్లు కామెంట్ చేస్తూ 'చంద్రబాబు గారు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ? 5 లక్షల మందిలో మేము కూడా ఉన్నామా' అంటూ ట్విట్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరికొందరు విజయసాయి రెడ్డి పైనే ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఆంధ్ర రాజకీయాలలో అధికారాన్ని ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని అధికార పార్టీలు విమర్శించుకోవడం తప్ప ఆంధ్రకు అభివృద్దనేది లేదని మండిపడుతున్నారు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: