కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.  రేపు కర్ణాటకలో కుమారస్వామి బలనిరూపణ చేసుకోనున్నారు.  ఈరోజు అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనున్నది.  సుప్రీం తీర్పుపై ఆధారపడి కుమారస్వామి బలనిరూపణ ఉండొచ్చు.  


బలాన్ని నిరూపించుకొని గట్టెక్కాలి అంటే అసమ్మతి ఎమ్మెల్యేలు తప్పకుండా అందుబాటులో ఉండాలి.  వారి రాజీనామాలు వెనక్కి తీసుకోవాలి.  అసమ్మతి ఎమ్మెల్యేలు మినహా మిగతావారంతా రిసార్ట్స్ లో ఉన్నారు.  వాళ్ళకోసం ఆయా పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.  


ఈరోజు తీర్పు ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తమ రాజీనామాలు ఆమోదించాలని ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే సుప్రీం మెట్లు ఎక్కలేదు.  దేశ చరిత్రలో ఇది మొదటిది కావొచ్చు.  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసునని, రాజ్యాంగ బద్దంగానే నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు స్పీకర్.  


స్పీకర్ ఫార్మాట్ లోనే రెండుసార్లు రాజీనామా లేఖలను స్పీకర్ కు అందజేశారు.  కానీ, వాటిని ఇప్పటివరకు ఆమోదించలేదు.  పైగా ప్రభుత్వం విప్ ను జారీ చేసింది.  దీంతో కన్నడ రాజకీయం రసవత్తరంగా మారింది.  మరి ఈరోజు సుప్రీమ్ కోర్ట్ ఏమని తీర్పు ఇస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: