ఎల్కే అద్వానీ అంటే బీజేపీ .. బీజేపీ అంటే ఎల్కే అద్వానీ అనే పేరుంది.  మొన్నటి వరకు పార్టీలో ఉన్నారు.  ఇప్పుడు పార్టీ పదవి నుంచి బయటకు వచ్చారు.  75 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నుంచి పార్టీ పక్కన పెట్టింది.  


ప్రస్తుతం యూపీలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎల్కె అద్వానీ పాల్గొన్నారు.  కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.  పార్టీలో ఎలా ఉండాలి.  పార్టీ సిద్ధాంతాలు ఏంటి.  పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి.  నడుచుకోకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను కార్యకర్తలకు తెలియజేశారు.  


తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పుకున్నారు అనే దానికి ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో అద్వానీ పాక్ పర్యటన చేశారు.  అక్కడ జిన్నా సమాధిని సందర్శించారు.  జిన్నా గురించి పొగుడుతూ మాట్లాడారు.  


ఇది బీజేపీకి, అటు ఆర్ఎస్ఎస్ కు అది నచ్చలేదు.  పాక్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన్ను పార్టీ అధ్యక్షపదవి నుంచి తొలగించింది.  ఎవరైనా సరే పార్టీ నిబంధనలకు లోబడే ప్రతి ఒక్కరు పనిచేయాలని అద్వానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: