పరీక్షలు వస్తున్నాయి అంటే పాపం విద్యార్థులు నిద్రాహారాలు మాని చదువుతుంటారు.  ఎలాగైనా పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగాలు పొందాలని భావిస్తుంటారు.  ఎంతమంది పాస్ అవుతారు అనే సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా బీహార్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది.  


ఈ పరీక్షల్లో ఓ ప్రశ్న అడిగింది.  అది గవర్నర్ గురించి.  గవర్నర్ అధికారాల గురించి. జనరల్ స్టడీస్ 2 పేపర్లో గవర్నర్ నిజంగానే కీలుబొమ్మనా ? అనే ప్రశ్నను అడిగింది.  ఈ ప్రశ్నపై అనేక విమర్శలు వస్తున్నాయి.  రాజ్యాంగబద్ధమైన పదవికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు ఆడోగొచ్చా అని ప్రశ్నిస్తున్నారు.  


బీహార్ లో గవర్నర్ వ్యవస్థ ఎప్పుడూ వివాదంలోనే ఉంది. 2000లో అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీని కాదని నితీష్ కుమార్ ను సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేయమనడం వివాదాస్పదమైంది. నితీష్ సీఎం అయిన 7వరోజే బలపరీక్ష నిరూపించుకోక ఓడిపోయారు. ఇక 2005లో కూడా అప్పటి గవర్నర్ బూటా సింగ్ అసెంబ్లీని రద్దు చేయడం వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది.

దీనిపై బీహార్ కమిషన్ ఎగ్జామినర్ కూడా స్పందించాడు. ఈ ప్రశ్న ఇలా అడిగేది కాదన్నారు. ప్రశ్న సెట్ చేసిన అధ్యాపకుడిని సస్పెండ్ చేశామన్నారు.  అంతా జరిగిపోయాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది.  ఉద్యోగం కోసం రాత్రంబవళ్ళు కష్టపడి చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలియాలి కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: