తెలుగు నటి జయప్రద ఉత్తర ప్రదేశ్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధం అయ్యింది.  గత పార్లమెంట్ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరపున రాంపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది.  అజాంఖాన్ అక్కడి నుంచి విజయం సాధించాడు.  


కాగా, అంతకు ముందు ఆయన రాంపూర్ అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.  ఎంపీగా గెలాడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా చేయడం ద్వారా.. ఆ నియోజక వర్గం నుంచి జయప్రద పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. 


జయప్రద ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కనౌజ్‌ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందిన ఆమెను ఆ స్థానంలో నిల్చోబెడితే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్‌ నేత వెల్లడించారు.  


1980 వ సంవత్సరం నుంచి ఎస్పీనే విజయం సాధిస్తూ వచ్చింది.  ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ వస్తున్నది.  కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు.   ఈసారైనా ఆ పార్టీ విజయం సాధిస్తుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: