వరంగల్ రాజకీయాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కొండా దంపతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ హయాంలో కొండదంపతులు కాంగ్రెస్ లో కొనసాగారు.  అప్పట్లో తెలంగాణ ఉద్యమం కొనసాగే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలక సభ్యురాలిగా ఉండేవారు.  తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బాయ్ చెప్పి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.   వరంగల్ తూర్పు నుంచి కూతురు సుస్మితా పటేల్‌ను దింపాలని అనుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు తొలి విడత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై అప్పట్లో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో కొండ దంపతులకు సరైన న్యాయం జరగలేదని ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో పక్కుకు తప్పుకున్నారు. ఈ మద్య చాలా మంది బీజేపీ లోకి వలసలు వెళ్తున్న క్రమంలో కొండ దంపతుల బీజేపీ తీర్థం పుచ్చుకుంటారేమో అని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.    మరోవైపు భూపాలపల్లి నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈయన టీడీపీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారాయన.

మరి వీరిద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ? లేదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా, టీఎస్‌ఆర్‌టీసీ మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి దత్త్తాత్రేయ సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ  కండువా కప్పి ఆయన్ను ఆహ్వానించారు.  ఈ నేపథ్యంలో కొంత మంది సీనియర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని బీజేపీ సీనియర్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: