టీడీపీ సీనియర్ దళిత నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధమైందని రాజకీయ వర్గాలు చెబుతున్న మాటలు. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చెలరేగిపోతున్న బీజేపీకి దళిత నేతల కొరత తీవ్రంగా ఉందట.. ఈ నేపథ్యంలో ఈయన బీజేపీలో చేరి ఆ కోటాలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కొట్టేయడానికి రెడీ అయ్యారట..జూపూడి ప్రభాకర్ రావు.


మంచి వాగ్ధాటి గల ఈయనను నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం ఏపీలో కాంగ్రెస్  కనుమరుగు కావడంతో 2014లో జూపూడీ వైసీపీలో చేరారు. వైఎస్ కు దగ్గరైన జూపూడికి జగన్ కొండపి స్థానం కూడా ఇవ్వగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారు.అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో జూపూడీ ఫ్లేట్ ఫిరాయించాడు. వెంటనే చంద్రబాబును ప్రసన్నం చేసుకొని టీడీపీలో చేరిపోయారు.


కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం.. మళ్లీ లేచే పరిస్థితి లేకపోవడంతో జూపూడీ పక్క చూపులు చూస్తున్నారు. అయితే వైసీపీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. జగన్ ను మోసం చేసి పోయిన అతడిని  ఆ పార్టీలోకి రానిచ్చేవారు లేరు. దీంతో బీజేపీలో చేరడానికే రెడీ అయ్యారట.. ముహూర్తం చూసుకొని చేరి బీజేపీలో దళిత నేతల కొరత తీరుస్తాడట.. చూడాలి మరి జూపూడీ అడుగులు ఎటుపడుతాయో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: