కష్టం వచ్చినా తట్టుకునేందుకు.. ఆపద చుట్టుముట్టినా ఆదుకునేందుకు.. ప్రకృతి కన్నెర్రజేసినా.. బయటపడేందుకు అన్నదాతలకు ఓ  దారుంది అదే బీమా పథకం! ఓ వైపు ప్రీమియం రూపంలో డబ్బులు ఖర్చవుతున్నా తగిన మేలు జరగకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నారు.
2017-18 లో మొత్తం 5.57 లక్షల మంది రైతుల తరపున బీమా సంస్థకు అందిన ప్రీమియం మొత్తం రూ.230 కోట్లు. అప్పట్లో  రైతులు అకాల వర్షాలకు సర్వం కోల్పోతే  బీమా సంస్థ చెల్లించిన పరిహారం  పదివేల మందికి రూ.17.65కోట్లు మాత్రమే. 2018-19 లో 6.39 లక్షల మంది రైతుల  నుంచి బీమా సంస్థకు ప్రీమియం రూపంలో అందిన మొత్తం రూ.263.13 కోట్లు . ఆ ఏడాది అక్టోబర్ లో తిత్లీ  తుఫాను పంటలను తుడిచి పెట్టేసింది. అప్పుడు బీమా సంస్థ చెల్లించ పరిహారం  రూ.6.50 కోట్లు మత్రమే.

గత నాలుగేళ్లలో బీమా  సంస్థలు రైతుల  తరుపున ప్రీమియం రూపంలో అందుకున్న మొత్తం రూ.958. అయితే చివరి రెండేళ్లలో బీమా సంస్థలు రైతులకు చెల్లించిన పరిహారం రూ.24.30కోట్లు మాత్రమే. అంటే.. 2.53 శతం మాత్రమే . ఆరుగాలం శ్రమించి సాగు చేసే రైతన్న పంట బాగా పండి మంచి దిగుబడులు రావాలనుకుంటారు గాని పంట నష్టం పేరుతో పరిహారాన్ని ఏ రైతు ఆశించారు. ప్రకృతి ప్రకోపించి పంటలు తుడిచి పెట్టుకుపోతే బీమా సంస్థ చెల్లించే పరిహారం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తారు.

అలా జరగక పోవడమే  అన్నదాతలను కలవర పెడుతోంది. సాగు చేసిన విస్తీర్ణంలో యాభై శాతానికి మించి దిగుబడులు రాకపోతే బీమా సంస్థలు రైతులకు పరిహారం చెల్లిస్తాయి . వీటికి తోడు జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం చేపట్టే పంట కోత ప్రయోగాల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటుంది. కాని ఇవేమి తమకు పూర్తిస్తాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోలన వ్యక్తంచేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: