జిల్లా అటవీ శాఖ టెరిటోరియల్ విభాగంలో పలువురు ఉద్యోగులకు పదోన్నతులు దక్కకపోవడం వెనుక ఏం జరిగింది? అనే విషయం పై విచారణ ప్రారంభించారు. కొందరు ఉన్నతాధికారులు డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదు అందడంతో విశాఖ పట్నానికి  చెందిన డివిజినల్  ఫారెస్టు ప్లయింగ్ స్క్వాడ్ అధికారి సీహెచ్ . సూర్యనారాయణ  శ్రీకాకుళం  వచ్చీ  డీఎఫ్ ఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీశాఖ అధికారిగా 2016 లో బాధ్యతలు స్వీకరించిన శాంతి స్వరూప్ హయాంలో 21 మందికి పదోన్నతులు కల్పించారని అన్నారు. 2016 నుంచి 2019 వరకు 10 మందికి ఫారెస్ట్ అధికారులుగా , 11 మందికి ఫారెస్ట్ బీడ్ అధికారులుగా పదోన్నతులు ఇచ్చారని  ఇందిలో ఒకరు మరణించారు తెలిపారు.

ఈ పదోన్నతుల విషయంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మరాయంటూ ఆ శాఖా ఉన్నతాధికారుకలు కొందరు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు విచారణ నిర్వహించి నివేదిక అందించాలని చీఫ్ కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్ ) రాహుల్ పాండే అధికారులను ఆదేశించారు. అప్పట్లో పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగులను పిలిచీ ఈ విషయంపై విచారణ చేశారు. వారి నుంచి సేకరించిన వివరాలను లిఖిత పూర్వకంగా నమోదు చేసారు. పదోన్నతులకు సంబంధించిన దస్త్రాలను పరిశించారు.

ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీలలో కూడా సొమ్ములు చేతులు మారాయని ఫిర్యాదులు రావడంతో వాటిపైన కూడా విచారణ చేపడుతున్నట్లు సూర్యనారాయణ తెలిపారు. ఈ విచారణ నివేదికను సీసీఎఫ్ రాహుల్ పాండేకు అందజేస్తామన్నారు. పూర్తిస్థాయి లో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: