ఈ మద్య దేశ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.  తప్పతాగి రోడ్డుపై వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్స్ చేస్తున్నవారిని నివారించేందుకు ప్రధాన కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్  నిర్విహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.  ఈ మద్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఆడవారు సైతం పట్టుబడటం..నానా యాగీ చేయడం చూస్తున్నాం.

తాజాగా తాగిన మైకంలో ఉన్న ఓ మహిళ, ఓ వ్యక్తి నడిరోడ్డు మీద వీరంగం వేశారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తుండటంతో స్కూటీ మీద వెళుతున్న వారిని ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు.  దాంతో వెనుక కూర్చున్న మహిళ ఒక్కసారిగా  ట్రాఫిక్‌ పోలీసులపై చిందులు వేశారు. స్కూటీ తాళం చెవిని తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసును కొట్టి.. అతని నుంచి తాళం చెవిని లాక్కున్నారు. 

ఢిల్లీలోని మాయాపురిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.  స్కూటీపై వస్తున్న ఇద్దరు తప్పతాగి ఉన్నారని..అందుకే వారిని ఆపామని పోలీసులు తెలిపారు. అంతే కాదు ట్రాఫిక్‌ పోలీసులతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో స్కూటీని నడుపుతున్న వ్యక్తిని అనిల్‌ పాండే, ఆయన వెనుక కూర్చున్న మహిళను మాధురిగా గుర్తించి అరెస్టు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: