టాలీవుడ్ సినీ పరిశ్రమలో కామెడీ రోల్స్ తో, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హేమ. తెలుగులో హేమ చాలా సినిమాల్లో నటించినా మల్లీశ్వరి, అతడు, జులాయి సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఈ నటి సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 
 
నటి హేమ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏపీ బడ్జెట్లో కాపుల కోసం రెండు వేల కోట్ల రుపాయలు కేటాయించటం పట్ల జగన్మోహన్ రెడ్డిగారిని అభినందించారు హేమగారు. ప్రజలకు సేవ చేయటం కోసమే సినిమాలకు దూరమవుతూ రాజకీయాల్లోకి వస్తున్నానని హేమ చెప్పారు. గతంలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తరపున హేమ పోటీ చేసి ఓడిపోయారు. ఈమె వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం లభిస్తుంది. 


రాజమండ్రిలో సొంత ఇల్లు కట్టిస్తున్నానని ఆ ఇల్లు కట్టడం పూర్తయిన తరువాత రాజమండ్రిలోనే ఉండి పూర్తి సమయం రాజకీయాల కోసమే కేటాయిస్తానని చెప్పారు. కాపుల సమస్యల పట్ల పోరాటం చేస్తానని హేమ తెలిపారు. హేమ సినిమాలకు పూర్తిగా దూరం అవుతుండడంతో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవిలో కొనసాగుతారో లేక ఆ పదవికి రాజీనామా చేస్తారో సమాచారం తెలియాల్సి ఉంది. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: