ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య పెద్ద గొడవే జరిగింది. అచ్చెన్నాయుడు తన సీట్లో కూర్చోకుండా చంద్రబాబు పక్కనే బుచ్ఛయ్య చౌదరికి కేటాయించిన సీటులో కూర్చొంటున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. 


ఈ విషయంపై జగన్ మాట్లాడుతూ 'కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారన్నారు. చంద్రబాబు మాట్లాడితే 40 ఏళ్ల అనుభవం అంటారు, ప్రతీదీ వివాదం చేయడం చంద్రబాబుకు అలువాటు, అని చెప్పారు. స్పీకర్‌ ను అగౌరవపరుస్తూ మాట్లాడటం సరికాదు. మాకు సంఖ్యా బలం ఎక్కువున్నా, మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాతో ఎలా వ్యవహరించారో తెలుసుకోండి'' అని అన్నారు. 


ఈ వ్యాఖ్యకి చంద్రబాబు స్పందిస్తూ స్పీకర్‌ స్థానాన్ని గౌరవిస్తూ సీటు మారాలని కోరిన వెంటనే అచ్చెన్నాయుడికి చెప్పానని చంద్రబాబు తెలిపారు. కాగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీతో ఎలా ప్రవర్తించామో తెలుసుకోండి అని అన్నారు. ఆ వ్యాఖ్యను నేను కండిస్తున్నాను 'మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టారు, అధికారంలో ఉన్న మమ్మల్ని తిడుతున్నారు. మీలా మేము ప్రవర్తించలేదు' అంటూ వ్యాఖ్యానించారు.

కాగా ఈ వార్తలను చుసిన నెటిజన్లు కొందరు ఆగ్రహానికి గురవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీట్ల గొడవ ఏంటి, అసెంబ్లీ సమయాన్ని అంత వృధా చేస్తున్నారు అంటూ వ్యాఖ్య చేస్తున్నారు. మరికొందరు బడ్జెట్ గురించి చర్చించకుండా ఈ సీట్ల రగడ ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: