ఎర్రజండా పట్టకున్నా ఎర్రెర్రని భావజాలం తో కనిపించే పవన్ కయ్యానికి జనసేనకే మాకూ జెండానే తేడా ఎజెండా ఒకటే అన్నట్టు గా వ్యవహరించిన వామ పక్షాలు కట్ చేస్తే ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారట.  జనసేనాని చూపు కాషాయంపై  మళ్ళుతోందన్న సంకేతాల నేపద్యంలో ఆగ్రహమంతో మరింత ఎరుపెక్కుతున్నాయట ఎర్ర జెండాలు. 
ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీదా పైసీపి దూసుకెళ్లిపొతోంది టిడీపీ సంక్షోభ ఛాయిల్లో ఉంది బీజేపీ చాప కింద నీరులా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ఏమో ఇంకా కోమాలోనే ఉంది. మరి కమ్యూనిష్టు పరిస్థితేంటి అటు సీపీఐ ఇటు సీపీఎం రెండూ కుడా ఇప్పుడు జనసేన వైపు చూస్తూ కొపంతో ఊగిపోతున్నాయట 2024 ఎన్నికలకు తాము కన్న కలల్లో పవన్ కళ్యన్ కల్లలు చేస్తున్నాడా అన్న డౌట్ వామపక్షాల్లో క్రమంగా బలపడుతోందట.  జనసేన బీజేపీ కి దెగ్గిర కాబోతుందన్న ప్రచారంతో ఎర్రజెండా లు ఆవెశంగా ఉన్నయి.
 టీడీపీ తో దోస్తాన వీడిన తర్వాత జనసేన కమ్యూనిస్టులతో కలిసి నడిచింది సీపీఐ  సీపీఎం కూడా పవన్ కళ్యాణ్ భావాల మిద ఆయనకున్న ఇమేజ్ మిద చాలా హోప్స్ పెట్టుకున్నారు వామపక్షాలూ జనసేన కలిసి ముందుకు నడిచాయి ఎన్నికల బరిలో కూడా పొత్తు రాగాలు ఆలపించారు.   2024 ఎన్నికలలో ఎమి జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: